Vijay: నిజమే విజయ్‌తో నాకు మాటల్లేవు కానీ..
నటుడు విజయ్(Vijay)కి ఆయన తండ్రి చంద్రశేఖర్(Chandrasekhar)కు మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు ఎప్పటి నుంచో నెట్టింట చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా చంద్రశేఖర్ స్పందించారు.
చెన్నై: తనకి తన కుమారుడు విజయ్ (Vijay)కు మధ్య గడిచిన ఏడాదిన్నరగా సరిగ్గా మాటల్లేవనే విషయం నిజమేనని నటుడి తండ్రి చంద్రశేఖర్ (Chandrasekhar) స్పష్టం చేశారు. అయితే అదేమీ చర్చించుకోవాల్సినంత పెద్ద అంశం కాదని అన్నారు. తండ్రీకొడుకులన్నాక చిన్న చిన్న మనస్పర్థలు రావడం.. తిరిగి కలుసుకోవడం సహజమని తెలిపారు. ఈ మేరకు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని విజయ్ గురించి మాట్లాడారు.
‘‘విజయ్‌కు నేనంటే ఎంతో ఇష్టం. నాతో ఎంతో క్లోజ్‌గా ఉండేవాడు. సినిమాల తర్వాత విజయ్‌కే నేను ప్రాధాన్యత ఇస్తాను. ఆ తర్వాతే నా భార్య. అయితే, కొన్ని విషయాల్లో చిన్న చిన్న మనస్పర్థలు రావడంతో విజయ్ నేనూ గడిచిన ఏడాదిన్నర నుంచి సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. అయితే, మా దృష్టిలో అదేం పెద్ద విషయం కాదు. మేమిద్దరం గొడవలు పడతాం, తర్వాత మళ్లీ కలుస్తాం. తండ్రీ కొడుకుల బంధంలో ఇలాంటివి సర్వసాధారణం. ఇటీవల మేమంతా కలిసి ‘వారిసు’ సినిమా చూశాం’’ అని చంద్రశేఖర్ తెలిపారు. రాజకీయ పార్టీ పరమైన విషయంలో విజయ్‌కి చంద్రశేఖర్‌కు మధ్య వాగ్వాదాలు జరిగాయని.. ఈ వ్యవహారం కాస్తా కోర్టు వరకు వెళ్లినట్లు గతంలో పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాంతో వీరిద్దరి మధ్య సత్సంబంధాలు లేవని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనపై మీడియా ప్రశ్న.. కేంద్రమంత్రి పరుగులు
-
World News
Pakistan: పాక్‌కు మరో అవమానం.. ఆ దేశ విమానం మలేసియాలో సీజ్..!
-
Crime News
ఫుడ్ పాయిజన్.. 26 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు అస్వస్థత
-
General News
Uppal Bhagayat plots: ‘ఉప్పల్ భగాయత్’లో ప్లాట్లకు మరోసారి ఈ-వేలం
-
Sports News
IPL 2023: వారి జాబితాలో చేరాలంటే.. అతడు మరో ఏడాది ఇలానే ఆడాలి: కపిల్ దేవ్
-
Politics News
Rahul Gandhi: మోదీజీ దేవుడికే పాఠాలు చెప్పగలరు.. అమెరికాలో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు