ఓవర్సీస్‌లో విజయ్‌ ‘మాస్టర్‌’ హవా!

విజయ్‌ ప్రధానపాత్రలో నటించిన ‘మాస్టర్‌’చిత్రం కలెక్షన్‌ పరంగా ఓవర్సీస్‌లో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు రూ3.85 కోట్లవసూళ్లు రాబట్టినట్టు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు.  ఇంతవరకు ఏ కోలీవుడ్‌ చిత్రం ఈ స్థాయిలో

Published : 18 Jan 2021 18:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ ప్రధానపాత్రలో నటించిన ‘మాస్టర్‌’చిత్రం కలెక్షన్ల పరంగా ఓవర్సీస్‌లో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు రూ3.85 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు.  ఇంతవరకు ఏ కోలీవుడ్‌ చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేదని ఆయన ప్రస్తావించారు.  సినిమా విడుదలైన జనవరి 13వ తేదీన ఆస్ట్రేలియాలో అత్యధిక ఓపెనింగ్స్‌ దక్కిన తొలి తమిళచిత్రంగా రికార్డు సృష్టించిందన్నారు.  ఖైదీ చిత్రంతో గతేడాది హిట్టు కొట్టిన లోకేష్‌ కనగరాజ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. విజయ్‌సేతుపతి, అర్జున్‌దాస్, మాళవిక మోహన్‌ కీలకపాత్రల్లో నటించారు. అనిరుథ్‌ స్వరాలు సమకూర్చారు.  కోలీవుడ్‌లో ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా ‘మాస్టర్‌’నిలిచింది.

ఇవీ చదవండి!

సైఫ్‌ అలీఖాన్‌ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం

బాలకృష్ణ సాంగ్‌..అల్లరి నరేష్‌ రీమిక్స్‌!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని