హీరో విజయ్‌కు రూ.లక్ష జరిమానా

తమిళ హీరో విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తన రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ కారు కేసులో న్యాయస్థానం ఆయనకు .....

Published : 13 Jul 2021 17:36 IST

చెన్నై: తమిళ హీరో విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తన రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ కారు కేసులో న్యాయస్థానం ఆయనకు జరిమానా విధించింది. ఇంగ్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఈ లగ్జరీ కారుకు పన్ను కట్టనందుకు గానూ హైకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. దాదాపు రూ. 7.95కోట్ల విలువైన ఈ రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ కారుకు పన్ను మినహాయింపు కోరుతూ విజయ్‌ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణియన్‌ కొట్టివేశారు.

రూ.లక్ష జరిమానాను రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి కొవిడ్‌ సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించారు. సినిమాల్లో అవినీతి వ్యతిరేక పాత్రల్లో నటిస్తున్న హీరోలు పన్నులు కట్టడంలో విఫలమవుతున్నారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తమిళ సినీ హీరోలు పాలకులుగా ఉన్నారని గుర్తు చేశారు. అందువల్ల ప్రజలు వారిని రియల్‌ హీరోలుగా చూస్తారన్నారు. రీల్‌ హీరోలు రియల్‌ హీరోలుగా నిలవాలని సూచించారు. పన్ను చెల్లించడం ప్రతి పౌరుడి విధి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని