kollywood: షారుక్‌- అట్లీ చిత్రంలో విజయ్‌?

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌- తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది నటి నయనతార ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి మరో విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. తమిళ నటుడు, అభిమానులు ‘తలపతి’ అని ముద్దుగా పిలుచుకునే హీరో విజయ్‌

Published : 09 Sep 2021 23:26 IST

ముంబయి: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌- తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది నటి నయనతార ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి మరో విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. తమిళ నటుడు, అభిమానులు ‘తలపతి’ అని ముద్దుగా పిలుచుకునే హీరో విజయ్‌ సైతం ఇందులో ఓ కామియో రోల్‌ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పుణెలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. గతంలో అట్లీ దర్శకత్వంలో థెరీ, బిగిల్‌, మెర్సెల్‌.. చిత్రాలు హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. అప్పట్లో ‘బిగిల్‌’ చిత్రంలో షారుక్‌ నటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. అది నిజం కాలేదు. ఈసారైనా వీరి జోడి వస్తుందన్న లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంలో నటులు రానా, సాన్య మల్హోత్రా, సునీల్‌ గోవర్‌, సైతం కీలక పాత్ర పోషించనున్నట్లు. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్‌కి  ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు.. ఏఆర్‌ రెహమాన్‌, అనిరుధ్‌ రవిచందర్‌ పనిచేస్తున్నారని వినిపించగా.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని