Allu Arjun: ‘పుష్ప2’ రికార్డును బ్రేక్‌ చేసిన ‘లియో’..

సోషల్ మీడియాలో ‘పుష్ప2’ (Pushpa2) పోస్టర్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ఓ రికార్డును విజయ్ ‘లియో’(Leo) చిత్రం బ్రేక్‌ చేసింది.

Published : 18 Sep 2023 15:22 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌కు (Allu Arjun) దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ తెలిసిందే. ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకే చిన్న అప్‌డేట్‌ కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటుంది. తాజాగా అల్లు అర్జున్‌ ‘పుష్ప2’కు సంబంధించిన ఓ రికార్డును కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) ‘లియో’ సినిమా బ్రేక్‌ చేసింది.

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటిస్తోన్న సినిమా ‘పుష్ప2’ (Pushpa2). ఇటీవల ఈ సినిమాలో నుంచి అల్లు అర్జున్‌ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో 33 నిమిషాల్లోనే 10లక్షలకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో వేగంగా వన్‌ మిలియన్‌ లైక్స్‌ను సాధించిన పోస్టర్‌గా ‘పుష్ప2’ రికార్డు సృష్టించింది. తాజాగా ఈ రికార్డును కోలీవుడ్‌ హీరో విజయ్‌ ‘లియో’ (Leo) బ్రేక్‌ చేసింది. ఈ మూవీలో విజయ్‌కు సంబంధించిన ఓ లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. సరికొత్తగా ఉన్న ఆ పోస్టర్‌కు 32 నిమిషాల్లోనే 10 లక్షల లైక్స్‌ వచ్చాయి. దీంతో బన్నీ రికార్డును విజయ్‌ బ్రేక్‌ చేశారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు దీనికి సంబంధించిన ఇమేజ్‌లు కూడా ట్విటర్‌లో దర్శనమిస్తున్నాయి. 

వినాయక చవితికి వినోదాన్ని పంచిన కొత్త పోస్టర్లు..

‘లియో’ స్టైల్‌లో తెలుగు హీరోలు..
మరోవైపు ‘లియో’ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ సృష్టిస్తోంది. దీంతో తెలుగు హీరోల ఫొటోలతో ఆ పోస్టర్‌ను తయారు చేస్తున్నారు అభిమానులు. ఆ స్టైల్‌లో మన హీరోలు ఇలా ఉంటారంటూ ఇమేజ్‌లు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం అవి ట్విటర్‌లో వైరల్‌గా మారాయి. లియో స్టైల్‌లో మహేశ్‌ బాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ల పోస్టర్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘లియో’ దసరా కానుకగా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని