vijay: విజయ్‌ కొత్త చిత్రం షురూ.. చెన్నైలో ప్రారంభమైన సినిమా షూటింగ్‌

విభిన్న పాత్రలతో అందరినీ ఆకట్టుకునే హీరో విజయ్‌ ‘మాస్టర్‌’ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న బీస్ట్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 06 Apr 2022 15:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విభిన్న పాత్రలతో అందరినీ ఆకట్టుకునే హీరో విజయ్‌ నటించిన ‘బీస్ట్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ హీరోకి సంబంధించిన మరొక కొత్త సినిమా ప్రారంభమయింది. విజయ్‌ 66వ చిత్ర పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది.ఈ కార్యక్రమానికి పలువురు నటీనటులు హజరై సందడి చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన  ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. శ్రీవల్లిగా అందరి మనసులు కొల్లగొట్టిన రష్మిక ఇందులో విజయ్ సరసన నటిస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. 

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని