Updated : 07 Apr 2022 16:00 IST

Vijay 66: విజయ్‌-వంశీల చిత్రం ప్రారంభం

తమిళ ప్రముఖ కథానాయకుడు విజయ్‌, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లిల కలయికలో రూపొందుతున్న కొత్త చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం నుంచి ప్రారంభమైంది. దిల్‌రాజు క్లాప్‌ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని ‘దళపతి 66’ గా పిలుస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌లు... పీవీపీ బ్యానర్‌పై పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్‌ ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. ‘‘వంశీ మంచి కథ సిద్ధం చేశారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో... విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దుతారు. విజయ్‌ కెరీర్‌లోనే భారీ చిత్రమవుతుంద’’ని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తిక్‌ పళని, ఎడిటింగ్‌: కేఎల్‌ ప్రవీణ్‌.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని