Vijay Sethupathi: ‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్‌ సేతుపతి సమాధానమేంటంటే

విజయ్‌ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్‌ యూ మీట్‌’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు.

Published : 17 Jun 2024 17:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకు ‘పుష్ప 2’ (Pushpa 2)లో నటించే అవకాశం వస్తే తిరస్కరించారంటూ వచ్చిన వార్తలపై కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) స్పందించారు. తన కొత్త సినిమా ‘మహారాజ’ థ్యాంక్‌ యూ మీట్‌లో విలేకరి ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ‘మహారాజ’ (Maharaja)కు తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో విజయ్‌, నిథిలన్‌, నటుడు నటరాజన్‌ సుబ్రహ్మణ్యం పాల్గొని, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్‌ డైరెక్టర్లు మారుతి, గోపీచంద్‌ మలినేని, బుచ్చిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మరి, ‘పుష్ప 2’తోపాటు ఇతర ప్రశ్నలకు సేతుపతి సమాధానాలేంటంటే?

* ఇది మీ 50వ చిత్రం.. ఎంతో ప్రత్యేకం. ఈ డైరెక్టర్‌ను నమ్మడానికి కారణం?

విజయ్‌ సేతుపతి: నాక్కూడా తెలియదు. ఒక అమ్మాయితో ఒక అబ్బాయి ఎప్పుడు? ఎలా? ప్రేమలో పడతారో ఎవరు చెప్పగలరు. ఈ చిత్రం విషయంలోనూ అంతే.

* మైలురాయిలాంటి సినిమాతో ‘వన్‌మ్యాన్‌ షో’ అనిపించుకోవాలనుకున్నారా?

విజయ్‌ సేతుపతి: ఈ సినిమా విషయంలో నేనేదీ ప్లాన్‌ చేయలేదు. అన్ని అలా కుదిరాయి.

* ఈ సినిమాలో సెల్వం పాత్రకూ అధిక ప్రాధాన్యం ఉంది. ఒకవేళ ‘మహారాజ’గా కమల్‌ హాసన్‌ నటించి ఉంటే.. మీరు సెల్వం పాత్ర పోషించేవారా?

విజయ్‌ సేతుపతి: లేదు. ఎందుకంటే.. మన ఆడియన్స్‌కు బాగా తెలిసిన నటులు ఆ పాత్ర పోషిస్తే పెద్దగా ప్రభావం ఉండదు. ఎక్కువ మంది ఆడియన్స్‌కు తెలియని వారైతేనే బాగుంటుంది. బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ అద్భుతంగా నటించారు.

* నేరుగా తెలుగులో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?

విజయ్‌ సేతుపతి: తెలుగు చిత్రాల్లో నటించేందుకు నేను ప్రయత్నిస్తున్నా. కానీ, అవకాశాలే ఎవరూ ఇవ్వట్లేదు (నవ్వుతూ).

* ‘పుష్ప 2’లో నటించే ఛాన్స్‌ వస్తే తిరస్కరించారని వార్తలొచ్చాయి. నిజమేనా?

విజయ్‌ సేతుపతి: నేను తిరస్కరించలేదు. జీవితంలో అన్ని సార్లు నిజం చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పడం మంచిది (నవ్వుతూ).

* రామ్‌చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో మీరు నటించే అవకాశం ఉందా?

విజయ్‌ సేతుపతి: నేను ఆ సినిమాలో ఏ పాత్రా పోషించట్లేదు.

* విలన్‌, ఫాదర్‌, హీరో.. ఇలా విభిన్న క్యారెక్టర్లు ప్లే చేశారు. మీకు బాగా ఇష్టమైన రోల్‌?

విజయ్‌ సేతుపతి: రొమాంటిక్‌ హీరోగా నటించడం అంటే ఇష్టం.

* ‘పిజ్జా 4’ రాబోతుందని, ‘పిజ్జా 1’తో దానికి లింక్‌ ఉందని న్యూస్‌ వచ్చింది. నిజమేనా?

విజయ్‌ సేతుపతి: నాక్కూడా అది న్యూసే.

* ‘మహారాజ’ పార్ట్‌ 2 ఉంటుందా?

మిథిలన్‌: ఈ చిత్రానికి సీక్వెల్‌ చేసే ఆలోచన లేదు.

మహారాజ రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు