Maha Manishi: ‘మహామనిషి’ కథ ఏంటి?

తమిళంలో విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్‌ సేతుపతి. పలు డబ్బింగ్‌ చిత్రాల ద్వారా తెలుగువారికీ పరిచయమయ్యారు.

Published : 09 Aug 2022 15:17 IST

హైదరాబాద్‌: తమిళంలో విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్‌ సేతుపతి. పలు డబ్బింగ్‌ చిత్రాల ద్వారా తెలుగువారికీ పరిచయమయ్యారు. ఆయన కీలక పాత్రలో శీను రామస్వామి తెరకెక్కించిన చిత్రం ‘మామనితన్‌’. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల జూన్‌ 22న తమిళంలో విడుదలైంది. ఇప్పుడు దీన్ని ఆహా ఓటీటీ వేదికగా ‘మహామనిషి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆగస్టు 12న ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ విడుదల చేసింది. నిజాయతీపరుడైన ఆటోడ్రైవర్‌ రాధాకృష్ణ (విజయ్‌ సేతుపతి) సగటు మధ్య తరగతి కుటుంబం. తన పిల్లలకు మంచి విద్యను అందించాలని వాళ్లని ప్రైవేటు స్కూల్లో చేరుస్తాడు. ఆటోతో పాటు మాధవన్‌ (షాజి)తో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తాడు. ఇందులో రాధాకృష్ణను మాధవన్‌ మోసం చేస్తాడు. తనని మోసం చేసిన మాధవన్‌ను పట్టుకునేందుకు రాధాకృష్ణ ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిణామాలేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ‘మహామనిషి’ చిత్రాన్ని ఇళయరాజా తనయుడు యువన్‌ శంకర్‌రాజా నిర్మించడం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని