Maharaja: ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి యాక్షన్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

విజయ్‌సేతుపతి తాజా చిత్రం ‘మహారాజ’ (Maharaja)లోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Published : 08 Jul 2024 11:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నిథిలన్‌ స్వామినాథన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మహారాజ’ (Maharaja). ఇటీవల విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా జులై 12 నుంచి ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ కానున్నట్లు సంస్థ తెలిపింది. అనురాగ్‌ కశ్యప్‌ కీలకపాత్రలో కనిపించిన ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్‌, నటరాజ్‌, భారతీరాజా, అభిరామి తదితరులు నటించారు. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) కెరీర్‌లో 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్ రూ.100 కోట్లు వసూలు చేసింది. ఆయన కెరీర్‌లోని హిట్‌ చిత్రాల వరుసలో చేరింది.

అలాంటి వారు సమాజానికి ప్రమాదకరం.. ప్రభుత్వానికి మంచు మనోజ్‌ విజ్ఞప్తి

క‌థేంటంటే: మ‌హారాజా (విజ‌య్ సేతుప‌తి) ఓ బార్బర్‌. ఒక‌ ప్రమాదంలో భార్యను పోగొట్టుకుంటాడు. అత‌నికంటూ మిగిలిన‌ ఒకే తోడు కూతురు జ్యోతి. త‌ను ఆ బిడ్డతోనే క‌లిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. మ‌హారాజా ఓరోజు ఒంటి నిండా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్ గ‌డ‌ప తొక్కుతాడు. ముగ్గురు అగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని.. ఈ క్రమంలోనే త‌మ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లిపోయార‌ని.. ఎలాగైనా స‌రే ఆ ల‌క్ష్మిని వెతికి పెట్టమ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాడు.  మ‌రి మ‌హారాజా చెప్పిన ఆ ల‌క్ష్మి ఎవ‌రు? అతని ఫిర్యాదును స్వీక‌రించ‌డానికి పోలీసులు తొలుత ఎందుకు నిరాకరించారు? అస‌లు మ‌హారాజాపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులెవ‌రు? వాళ్లకు, అత‌నికి ఉన్న విరోధం ఏంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని