విజయ్‌ సేతుపతి-నిహారిక మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

విజయ్‌ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’. తమిళంలో విజయవంతమైన

Published : 28 Mar 2021 10:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’. తమిళంలో విజయవంతమైన ‘ఓరు నల్ల నాల్‌ పాతు సోలరెన్‌’కి అనువాద రూపమిది. అరుముగా కుమార్‌ దర్శకత్వం వహించారు. రావూరి వెంకటస్వామి నిర్మాత. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు   ప్రకటించింది చిత్రబృందం.

నిర్మాత మాట్లాడుతూ ‘‘మాస్‌ అంశాలతో కూడిన యాక్షన్‌ కథా చిత్రమిది. తమిళంలో మంచి విజయం అందుకుంది. నిహారిక భిన్నమైన పాత్రలో కనిపిస్తారు. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందీ చిత్రం’’ అన్నారు. జస్టిన్‌ ప్రభాకరన్ స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు