బంపర్ఆఫర్‌ వదులుకున్న విజయ్‌..?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి బంపర్‌ఆఫర్‌ వదులుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఆంగ్ల పత్రికలు. కథానాయకుడిగా, నటుడిగా, ప్రతినాయకుడిగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తోన్న...

Published : 15 Feb 2021 19:12 IST

బరువు పెరగడమే కారణమా

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి బంపర్‌ఆఫర్‌ వదులుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఆంగ్ల పత్రికలు. కథానాయకుడిగా, నటుడిగా, ప్రతినాయకుడిగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తోన్న విజయ్‌ సేతుపతికి గతేడాది బాలీవుడ్‌లో నటించే సువర్ణావకాశం లభించింది. బీటౌన్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’లో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం ప్రకటించింది. అయితే, గతేడాది మార్చిలోనే విజయ్‌ ఈ సినిమా షూట్‌లో పాల్గొనాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా పరిస్థితులు వేగంగా మారిపోయాయి.

కాగా, తాజా సమాచారం ప్రకారం విజయ్‌సేతుపతి.. ‘లాల్‌సింగ్‌ చద్దా’ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ప్రాజెక్ట్‌లన్నీ ఒక్కసారిగా పట్టాలెక్కడంతో డేట్స్‌ సర్దుబాటు కాక విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను వదులుకొన్నట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల కొన్ని సినిమాల కోసం విజయ్‌ సేతుపతి బాగా బరువు పెరిగారని.. ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రబృందం మాత్రం ఆయన శరీరాకృతి పట్ల సానుకూలంగా లేదని.. దీంతో ఆయనే స్వయంగా తప్పుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చదవండి

నిశ్చితార్థం తర్వాత పిల్లలు నాపై కోపంగా ఉన్నారు

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని