Vijay Sethupathi: నేను కేవలం నటుడిని మాత్రమే... విజయ్‌ సేతుపతి అసహనం

దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు నటుడు విజయ్‌ సేతుపతి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. విలేకరి చేసిన ఓ వ్యాఖ్యపై అసహనం వ్యక్తం చేశాడు.

Published : 08 Feb 2023 10:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హీరోగానే కాకుండా విలన్‌గానూ నటిస్తూ దక్షిణాదిలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi). ప్రస్తుతం తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడిని పాన్‌ఇండియా స్టార్‌గా అభివర్ణించగా..  తనని అలా పిలవడంపై అసహనానికి గురయ్యాడు.

‘‘నన్ను పాన్‌ ఇండియా నటుడని పిలవొద్దు. నేను కేవలం నటుడిని మాత్రమే. పాన్‌ ఇండియా స్టేట్‌మెంట్‌తో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ మాట ఒత్తిడికి కూడా గురి చేస్తుంది. మరోసారి చెబుతున్నా.. నేను కేవలం నటుడిని మాత్రమే.. దానికి ఎలాంటి లేబుల్‌ వేయొద్దు. అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంది. బెంగాలీ, గుజరాత్‌.. ఇలా ఎక్కడ అవకాశం వచ్చినా నటిస్తా’’ అని విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అన్నారు.

‘సుందర్‌పాండియన్‌’, ‘పిజ్జా’, ‘96’తో విజయ్ సేతుపతి తెలుగువారికీ చేరువయ్యాడు. ‘సైరా’, ‘ఉప్పెన’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’ వంటి చిత్రాలతో మంచి పేరు సొంతం చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన ‘మైఖేల్‌’లో విజయ్‌ కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘మేరీ క్రిస్మస్‌’లో నటిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని