Vijay: ‘దళపతి 68’.. అధికారికం

‘లియో’ సినిమా తర్వాత కథానాయకుడు విజయ్‌ చేయనున్న కొత్త చిత్రమేదన్నది స్పష్టత వచ్చింది.

Updated : 22 May 2023 14:12 IST

‘లియో’ సినిమా తర్వాత కథానాయకుడు విజయ్‌ (Vijay) చేయనున్న కొత్త చిత్రమేదన్నది స్పష్టత వచ్చింది. ఆయన.. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్‌నే అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఓ వీడియో గ్లింప్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో హీరో, దర్శక నిర్మాతలు, సంగీత దర్శకుడి పేర్లను ఫజిల్‌ రూపంలో చూపించిన తీరు ఆసక్తి రేకెత్తించింది. ‘దళపతి 68’ వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని ఏజిఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది. దీనికి యువన్‌శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని