Samantha: విజయ్‌కి జోడీగా సమంత జత కుదిరిందా?

ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (గోట్‌)గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌. దీని తర్వాత హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.

Updated : 04 Jul 2024 09:39 IST

ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (గోట్‌)గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌. దీని తర్వాత హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. రాజకీయ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా ఎవరు నటిస్తారనే సస్పెన్స్‌ నిన్నటివరకూ ఉండేది. దానికి తెర దించుతూ అందాల నాయిక సమంత పేరు గట్టిగా వినిపిస్తోంది. వీరిద్దరూ గతంలో కలిసి నటించిన మూడు సినిమాలూ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రంలోనూ జోడీగా నటించడం అభిమానులను అలరిస్తుందంటున్నాయి సన్నిహితవర్గాలు. దీనికి అనిరుధ్‌ సంగీతం అందించనున్నారని సమాచారం. మరోవైపు ‘సిటాడెల్‌: హనీ-బన్నీ’, ‘మా ఇంటి బంగారం’ లాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది సమంత.


సేతుపతి సరసన నిత్య

ఇటీవలే ‘మహారాజ’గా మాస్‌ విజయాన్ని అందుకున్నారు విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. ఆ ఉత్సాహంతో తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నారు. ఆయన పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రంలో నటించనున్నారని సమాచారం. ఇందులో విజయ్‌ సరసన నిత్య మేనన్‌ కనిపించనున్నట్లు చిత్రవర్గాల మాట. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రమవుతుంది. ఈ జోడీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం ఖాయమని తెలుస్తోంది.  మరోవైపు ‘కాదలిక్క నేరమిళ్లై’, ‘డియర్‌ ఎక్సెస్‌’ చిత్రాలతో నిత్య, ‘గాంధీ టాక్స్‌’తో విజయ్‌ త్వరలోనే అభిమానుల ముందుకు రానున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని