Varasudu: భారీ ధరకు విజయ్‌ ‘వారసుడు’ నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌?

విజయ్‌ (Vijay) హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం

Published : 13 Sep 2022 15:32 IST

హైదరాబాద్‌: విజయ్‌ (Vijay) హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి తెలుగులో ‘వారసుడు’, (Varasudu) తమిళంలో ‘వరిసు’ (Varisu) అనే టైటిల్స్‌తో తీసుకొస్తున్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక (Rashmika) కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో ‘వారసుడు’ ప్రీరిలీజ్‌ బిజినెస్‌ పూర్తయినట్లు సమాచారం. తెలుగు, తమిళంతో పాటు, హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ మొత్తం కలిపి దాదాపు రూ.150కోట్లకు బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, ప్రభు, శ్రీకాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  వీలైనంత త్వరగా ‘వారసుడు’ షూట్‌ పూర్తి చేసి,  కనగరాజ్‌ మూవీ సెట్‌లో అడుగు పెట్టాలని భావిస్తున్నారు విజయ్‌. గ్యాంగ్‌స్టర్స్‌ నేపథ్యంలో కనగరాజ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని