ఆ సినిమా చూశాక నన్నెవరూ పెళ్లి చేసుకోరని అమ్మ కంగారు పడింది: ‘MCA’ నటుడు

‘పింక్‌’, ‘గల్లీబాయ్‌’, ‘సూపర్‌ 30’ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ వర్మ (Vijay Varma). తాజాగా ఆయన నటించిన చిత్రం ‘డార్లింగ్స్‌’ (Darlings). ఆలియా భట్‌

Published : 11 Aug 2022 16:31 IST

ముంబయి‌: నాని ‘MCA’ సినిమాతో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్‌ వర్మ (Vijay Varma). బాలీవుడ్‌లో ‘పింక్‌’, ‘గల్లీ బాయ్‌’, ‘సూపర్‌ 30’ చిత్రాలతో విలక్షణ నటుడిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘డార్లింగ్స్‌’ (Darlings). ఆలియా భట్‌ (Alia Bhatt) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమాలో విజయ్‌ వర్మ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాతోపాటు, వ్యక్తిగత విషయాలపై కూడా మాట్లాడారు.

‘‘డార్లింగ్స్‌’లో నేను పోషించిన హమ్‌జా పాత్రకు కొంతమంది నుంచి ప్రశంసల వస్తుంటే, మరి కొంతమంది నుంచి విమర్శలు వస్తున్నాయి. నా రోల్‌, యాక్టింగ్‌ బాగుందంటూ వస్తోన్న ప్రశంసలు చూస్తుంటే ఆనందంగా ఉంది. అయితే, సినిమా చూశాక మా అమ్మ రియాక్షన్‌ నేనెప్పటికీ మర్చిపోలేను. సినిమా అయిపోయాక... అమ్మ భయపడుతూ నన్ను దగ్గరకు పిలిచి.. ‘‘ఈ సినిమా చూసి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు?’’ అని అడిగింది. అమ్మా.. ఇది సినిమా మాత్రమే అని నేను ధైర్యం చెప్పడంతో ఆమె కుదుటపడింది అని విజయ్ వర్మ చెప్పాడు.

‘డార్లింగ్స్‌’లో భార్యను హింసించే భర్త పాత్రలో విజయ్‌ వర్మ నటించాడు. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. ప్రేమించి పెళ్లాడిన భార్యను అనుమానించి, చిత్రహింసలు పెట్టడం, ఆ భర్త బారి నుంచి బయటపడేందుకు భార్య చేసిన ప్రయత్నాలేంటి? వారిద్దరూ కలసి జీవనం కొనసాగిస్తారా? అనే అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని