Vijay Varma: వధువు కావాలంటోన్న విజయ్ వర్మ.. తమన్నాను ట్యాగ్ చేస్తోన్న నెటిజన్లు
హీరో విజయ్ వర్మ నటించిన తాజా వెబ్ సిరీస్ ‘దహాద్’ (Dahaad). దీని ప్రమోషన్లో భాగంగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. దానికి నెటిజన్లు తమన్నాను ట్యాగ్ చేస్తున్నారు.
హైదరాబాద్: హీరో విజయ్ వర్మ (Vijay Varma) గతంలో సినీ ప్రియులకు మాత్రమే తెలిసిన పేరు. కానీ కొన్ని రోజులుగా తరచూ మిల్కీ బ్యూటీ తమన్నా (Tammana)తో కలిసి షికార్లు చేయడంతో బాగా పాపులర్ అయ్యారు. తాజాగా ఈ హీరో పెట్టిన ఇన్ స్టా పోస్ట్‌కు నెటిజన్లు తమన్నాను ట్యాగ్ చేస్తున్నారు. అంతే కాదు కామెంట్లన్నీ కూడా ఆమె పేరుతో నిండిపోయాయి. ఇంతకి ఈ పోస్ట్‌కు తమన్నాకు ఉన్న సంబంధం ఏంటంటే..
విజయ్ వర్మ నటించిన తాజా వెబ్ సిరీస్ ‘దహాద్’ (Dahaad). సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ మే 12న విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతోంది. ఇక ఈ సిరీస్ ప్రచారంలో భాగంగా పేపర్‌లో ప్రకటన ఇచ్చారు. అందులో ఇండియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు వధువు కావలెను అని ఉంది. ఈ ఫొటోను విజయ్ వర్మ షేర్ చేశాడు. ‘ఈ విషయాన్ని మా అమ్మకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి’ అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో నెటిజన్లంతా ‘తమన్నా ఉందిగా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో తమన్నాను ట్యాగ్ చేస్తున్నారు. ఇక ఈ పోస్ట్‌కు సినీతారలు సైతం స్పందిస్తుండడం విశేషం.
కొన్ని రోజుల నుంచి తమన్నాతో విజయ్ వర్మ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో వీళ్లు కలిసి కనిపించడంతో ఈ వార్తలు మొదలయ్యాయి. ఆ తర్వాత నుంచి వీళ్లిద్దరూ కలిసి ఫంక్షన్లకు హాజరవుతున్నారు. ఇక తాజాగా మరోసారి ఒకే కారులో వెళ్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఫొటోగ్రాఫర్లకు హాయ్ చెబుతూ నవ్వుతూ ముందుకు సాగారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
-
India News
NIRF Rankings: దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా ‘ఐఐటీ మద్రాస్’.. వరుసగా అయిదో ఏడాది
-
India News
Ashok Gehlot: మ్యాజిక్ షోలు చేసైనా డబ్బులు సంపాదిస్తా.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
viral News: సిగరెట్లు తాగొద్దన్నందుకు రణరంగంగా మారిన యూనివర్శిటీ..!
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్‌కు అతిథిగా చినజీయర్ స్వామి