Tamannaah: విజయ్‌తో తమన్నా ప్రేమాయణం వార్తలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు..

నటి తమన్నాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింటిని షేక్‌ చేస్తోంది. నటుడు విజయ్‌ వర్మతో ఆమె ప్రేమలో ఉన్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి.

Updated : 03 Jan 2023 11:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah)కు సంబంధించిన ఓ వ్యక్తిగత విషయం ఇప్పుడు నెట్టింటిని షేక్‌ చేస్తోంది. బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో (Vijay Varma) తమన్నా ప్రేమలో పడిందంటూ అక్కడి మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ కొంత కాలం నుంచి డేటింగ్‌లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తలపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూ ఇయర్‌ (New Year 2023) వేడుకల కోసం తమన్నా-విజయ్‌ ఇటీవల గోవా వెళ్లారు. వేడుకల్లో భాగంగా వీరిద్దరూ కౌగిలించుకుంటూ ముద్దుపెట్టుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరూ సీక్రెట్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ కథనాలపై మిల్కీబ్యూటీ అభిమానులు స్పందిస్తూ.. ‘ఆమె వ్యక్తిగత జీవితం గురించి మీకు ఎందుకు?’, ‘వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని మీతో చెప్పారా?’, ‘వాళ్లిద్దరూ ఎంతోకాలం నుంచి స్నేహితులు. అలాంటప్పుడు కలిసి పార్టీలకు వెళ్తే తప్పేంటి?’, ‘రిలేషన్‌షిప్‌ని అధికారికంగా ప్రకటించే వరకూ ఆగితే కాస్త బాగుంటుంది’ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

విజయ్‌ వర్మ విషయానికి వస్తే.. హైదరాబాద్‌కు చెందిన ఆయన నటనపై ఉన్న ఆసక్తితో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. అనంతరం నటనలో శిక్షణ తీసుకుని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘పింక్‌’, ‘గల్లీబాయ్‌’, ‘సూపర్‌ 30’, ‘భాఘి 3’, ‘డార్లింగ్స్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తెరకెక్కిన ‘ఎంసీఏ’లో విలన్‌గానూ కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని