మళ్లీ విషమంగా విజయ్‌కాంత్‌ ఆరోగ్యం!

తమిళ నటుడు, డీఎండీకే  అధినేత విజయ్‌కాంత్‌ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమెరికా, సింగపూర్‌లలో చికిత్స చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు.

Published : 31 Aug 2021 14:42 IST

 

చైన్నై: తమిళ నటుడు, డీఎండీకే  అధినేత విజయ్‌కాంత్‌ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమెరికా, సింగపూర్‌లలో చికిత్స చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. అనారోగ్య కారణాల వల్ల  సినిమాలకు దూరమైన విజయ్‌కాంత్‌, పార్టీ బాధ్యతలను కూడా తన భార్యకు అప్పగించారు.  దీనికి తోడు సెకండ్‌ వేవ్‌లో కరోనా బారిన పడ్డారాయన. కొవిడ్‌ నుంచి కోలుకున్నా, ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు.  చైన్నైలోని ఓ ఆసుపత్రిలో తరచుగా వైద్య పరీక్షలకు వెళుతున్నారు.  తమిళనాడు  ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొనలేకపోయారు. తాజాగా ఆరోగ్యం మళ్లీ విషమించడంతో విదేశాలకు ప్రయాణమయ్యారని తెలిసింది.  చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్‌పై ఆయన వెళుతున్న దృశ్యాలు మీడియాకు బహిర్గతమయ్యాయి. లండన్‌కు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు దుబాయ్‌లో చికిత్స చేస్తారని సమాచారం. మరోసారి విజయ్‌కాంత్‌ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవడంతో అభిమానులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని