Vijayanand: వీఆర్‌ఎల్‌ గ్రూప్‌ అధినేత బయోపిక్‌.. స్ఫూర్తినిచ్చేలా ‘విజయానంద్‌’ టీజర్‌

ప్రముఖ లాజిస్టిక్‌ కంపెనీ వీఆర్‌ఎల్‌అధినేత ఆనంద్‌ శంకేశ్వర్‌ జీవితం తెరపైకి వస్తోంది.

Published : 03 Aug 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ లాజిస్టిక్‌ కంపెనీ వీఆర్‌ఎల్‌ (VRL Logistics) వ్యవస్థాపకుడు ఆనంద్‌ శంకేశ్వర్‌ జీవితం తెరపైకి వస్తోంది. ఆయన ప్రస్థానాన్ని ‘విజయానంద్‌’ (Vijayanand) పేరుతో రిషికా శర్మ ఓ సినిమాగా రూపొందిస్తున్నారు. శంకేశ్వర్‌ పాత్రలో నిహాల్‌ నటిస్తున్నారు. అనంత్‌ నాగ్‌, వినయ ప్రసాద్‌, ప్రకాశ్‌ బెలవాడి, అనిష్‌ కురువిల్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ఆనంద్‌ శంకేశ్వర్‌ తండ్రిపై ఆధార‌ప‌డ‌కుండా స్వతహాగా లారీల వ్యాపారంలోకి ఎలా ప్ర‌వేశించారు? ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా నిలిచిందెవ‌రు? తదితర విష‌యాల‌ను టీజ‌ర్‌లో చూపించారు. ఈ వీడియో ప్రేక్షకుల్లో స్ఫూర్తినింపేలా ఉంది. ఈ సినిమాతో వీఆర్‌ఎల్‌ సంస్థ నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని