Vijaya Shanthi: ఉద్యమాల వరకు తెచ్చుకోకండి.. ఓటీటీ సెన్సార్‌పై విజయశాంతి పోస్ట్‌

ఓటీటీ విషయంలోనూ సెన్సార్‌ ఉండాలని ప్రముఖ నటి విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Published : 19 Mar 2023 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమయ్యే చిత్రాలు, సిరీస్‌లకు సెన్సార్‌ తప్పనిసరి చేయాలని ప్రముఖ నటి, భాజపా నేత విజయశాంతి (Vijaya Shanthi) అన్నారు. ఆ అంశాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు సంబంధిత బోర్డు ముందుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ‘‘ఈ మధ్యనే విడుదలైన ఓ తెలుగు (బహుభాషా) ఓటీటీ సిరీస్‌పై..’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆమె పోస్ట్‌ పెట్టారు. ఓటీటీలో ప్రసారమయ్యే అసభ్యకరమైన దృశ్యాలను తొలగించి, ప్రజా వ్యతిరేకతకు గురికాకుండా చూసుకోవాలని సంబంధిత నటులు, నిర్మాతలకు సూచించారు. ‘‘తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోకుండా ఉంటారని భావిస్తున్నా. ప్రేక్షకులు చూపించే అభిమానాన్ని కాపాడుకుంటారని అభిప్రాయపడుతున్నా’’ అని అన్నారు.

పలువురు నెటిజన్లు ఈ పోస్ట్‌పై స్పందించారు. ‘మీరు చెప్పింది 100 శాతం నిజం’, ‘అవును.. ఓటీటీకి సెన్సార్‌ ఉండాలి’, ‘అత్యంత ఆవశ్యకత సంతరించుకున్న విషయంపై స్పందించినందుకు థ్యాంక్స్‌’, ‘మంచి పేరున్నా నటులూ ఓటీటీలో అసభ్యకరమైన సంభాషణలు చెబుతుంటే చిరాకు వస్తుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని