
Vikram: నేరుగా ఓటీటీలో విడుదలకానున్న విక్రమ్ ‘మహాన్’
ఇంటర్నెట్‌డెస్క్: తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రమ్ (Vikram). తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన కథల ఎంపిక ఉంటుంది. తనయుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram)తో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘మహాన్’(Mahaan). కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా థర్డ్‌వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ప్రైమ్ వేదికగా ‘మహాన్’ను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ మ్యూజిక్ డైరెక్టర్. బాబీ సింహా, సిమ్రన్, సంతానం తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన గత రెండు చిత్రాలు ‘జగమే తంత్రం’, ‘నవరస: పీస్’ ఓటీటీలోనే విడుదల కావటం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.