Cobra: విక్రమ్‌ ‘కోబ్రా’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

ప్రముఖ నటుడు విక్రమ్‌ పలు విభిన్న గెటప్పుల్లో నటించిన చిత్రం ‘కోబ్రా’. ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ తాజాగా ఖరారైంది.

Published : 24 Sep 2022 02:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు విక్రమ్‌ (Vikram) పలు విభిన్న గెటప్పుల్లో నటించిన చిత్రం ‘కోబ్రా’ (Cobra). ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ తాజాగా ఖరారైంది. ‘సోనీ లివ్‌’ (Sony Liv)లో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు ట్రైలర్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న సదరు సంస్థ ఏయే భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుందన్న విషయంపై స్పష్టతనివ్వలేదు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్‌ లెక్కల మాస్టారుగా నటించారు.

క‌థేంటంటే: ఒడిశా ముఖ్యమంత్రి  దారుణంగా హ‌త్యకి గుర‌వుతారు. కొన్నాళ్ల వ్యవ‌ధిలోనే బ్రిటిష్ యువ‌రాజుని కూడా త‌న వివాహ వేడుక‌లో అంద‌రూ చూస్తుండ‌గా హ‌త్య చేస్తారు. దీని వెన‌క గ‌ణిత మేథావి మ‌ది (విక్రమ్‌) మాస్టర్ మైండ్ ఉంటుంది. ఫోన్, ఇంట‌ర్నెట్ వాడ‌ని మ‌ది ర‌క‌ర‌కాల మారు వేషాల‌తో చాలా తెలివిగా చేయాల‌నుకున్నది చేసేస్తుంటాడు. ఈ రెండు హ‌త్యల వెన‌క ఓ కార్పొరేట్ క‌నెక్షన్‌ని క‌నిపెడ‌తారు ఇన్వెస్టిగేష‌న్ అధికారులు. క్రిమినాల‌జీ విద్యార్థి జూడీ (మీనాక్షి) ఆ రెండు హ‌త్యలు ఒక్కరే చేశార‌ని తేలుతుంది. త‌దుప‌రి ర‌ష్యా మంత్రికి కూడా ప్రమాదం పొంచి ఉంద‌నే విష‌యాన్ని ప‌సిగ‌ట్టి ఆ దేశ అధికారుల్ని హెచ్చరిస్తాడు ఇంట‌ర్ పోల్ అధికారి అస్లాన్ (ఇర్ఫాన్ ప‌ఠాన్‌). ఓ హ్యాక‌ర్ కూడా మ‌ది ముసుగుని తొల‌గించే ప్రయ‌త్నంలో ఉంటాడు. ఇన్ని స‌వాళ్ల మ‌ధ్య మ‌ది త‌న ప్లాన్‌ని విజ‌య‌వంతంగా అమ‌లు చేశాడా లేదా? ఇంత‌కీ అత‌నెవ‌రు? ఇండియాలో లెక్కల టీచ‌ర్‌గా ప‌నిచేసే మ‌ది (విక్రమ్‌)కి ఈ నేరాలు చేయాల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చింద‌నేది మిగ‌తా క‌థ‌.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని