పాత్రలు మారినా పేరు మారలేదు!

ఒక్కో దర్శకుడు ఒక్కో విషయంలో కంఫర్ట్‌ని  కోరుకుంటారనే విషయం తెలిసిందే. తాము తెరకెక్కించే ప్రతి సినిమాకు ఒకే సంగీత దర్శకుడ్ని తీసుకునే వాళ్లు కొందరైతే.. ఒక్క సన్నివేశం అయినా సరే ఫలనా లొకేషన్‌లో చిత్రీకరించాల్సిందే అనుకునే వాళ్లు మరికొందరు.

Updated : 12 Apr 2021 09:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాసుకున్న కథని తెరపైకి తీసుకొచ్చేందుకు ఒక్కో దర్శకుడు ఒక్కో విషయంలో కంఫర్ట్‌, సెంటిమెంట్ అనురిస్తారనే విషయం తెలిసిందే. తాము తెరకెక్కించే ప్రతి సినిమాకు ఒకే సంగీత దర్శకుడ్ని తీసుకునే వాళ్లు కొందరైతే.. ఒక్క సన్నివేశం అయినా సరే ఫలానా లొకేషన్‌లో చిత్రీకరించాల్సిందే అనుకునే వాళ్లు మరికొందరు. విక్రమ్‌ కె. కుమార్‌ దీనికి విభిన్నంగా నిలుస్తారు. అదెలా అంటే.. ఇప్పటి వరకు 8 సినిమాలు తీసిన ఆయన 6 సినిమాల్లోని నాయిక పాత్రకు ‘ప్రియ’ అనే పేరును పెట్టారు. ప్రియ అంటే ఆయనకు అంత ప్రియం! మరి ఆయన చిత్రాలేవి? ప్రియగా కనిపించిందెవరు? చూద్దాం..

‘సైలెంట్‌ స్ర్కీమ్‌’ అనే లఘు చిత్రం తెరకెక్కించి జాతీయ అవార్డు అందుకున్న విక్రమ్‌ తొలిసారి ‘ఇష్టం’ సినిమా కోసం మెగాఫోన్‌ పట్టారు. ప్రముఖ నటి శ్రియ తొలి చిత్రమిదే. ఇందులో ఆమె నేహ అనే పాత్ర పోషించింది. ఆయన ద్వితీయ చిత్రం ‘అలై’ (తమిళ్‌). ఇందులో మీరాగా కనిపించింది త్రిష. ఈ రెండు సినిమాలు మినహా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ ప్రియమైనవే. నీతూ చంద్ర, సమంత, నిత్యా మేనన్‌, కల్యాణి ప్రియదర్శిని, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ఈ జాబితాలో నిలిచారు.

నీతూ చంద్ర, చిత్రం: 13 బీ


నిత్యా మేనన్‌, చిత్రం: ఇష్క్‌, 24


సమంత, చిత్రం: మనం


కల్యాణి ప్రియదర్శిన్‌, చిత్రం: హలో


ప్రియాంక అరుళ్‌ మోహన్‌, చిత్రం: నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌

* ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా ‘థ్యాంక్యూ’ చిత్రం తెరకెక్కిస్తున్నారు విక్రమ్‌. ఇందులో ముగ్గురు నాయికలు సందడి చేయనున్నారు. మరి వారిలో ఎవరికి ప్రియ నామం ఉండబోతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని