Updated : 29 Jun 2022 12:58 IST

Vikram: విక్రమ్‌ వచ్చేస్తున్నాడు.. ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: విశ్వనటుడు కమల్‌హాసన్‌(Kamal Haasan) రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘విక్రమ్‌’ (Vikram) ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney plus Hotstar) వేదికగా జులై 8 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఓ స్పెషల్‌ వీడియోని షేర్‌ చేసింది. ఇందులో కమల్‌.. ‘‘మనకు నచ్చిన చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా చాల్లేదు కదూ. పదండి చూసుకుందాం డిస్నీ+హాట్‌స్టార్‌లో’’ అని చెప్పుకొచ్చారు. లోకేశ్‌ కనకరాజ్‌(Lokesh Kanakaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూళ్లు రాబట్టింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh fazil) కీలకపాత్రలు పోషించారు. నటుడు సూర్య (Surya) ‘రోలెక్స్‌’గా(Rolex) అతిథి పాత్రలో అదరగొట్టేశారు.

అసలు విక్రమ్‌ కథేంటంటే:

‘విక్రమ్‌’... పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. గ్యాంగ్‌స్టర్‌, ఆయన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీస్‌ బృందానికి మధ్య జరిగే పోరు ఇది. ఇందులో కమల్‌హాసన్‌.. కర్ణన్‌ అనే పాత్రలో నటించారు. భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్న పోలీస్‌ అధికారి ప్రభంజన్‌, ఆయన తండ్రి కర్ణన్‌ (కమల్‌హాసన్‌)ను ఓ ముఠా చంపేస్తుంది. ఈ డ్రగ్స్‌ దందాను నిలువరించి, హత్యలకు పాల్పడుతున్న ఆ ముఠాను పట్టుకునేందుకు అమర్‌(ఫహద్‌ ఫాజిల్‌) అనే స్పై ఏజెంట్‌, అండర్‌ కవర్‌ ఆఫీసర్‌ రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తు చేస్తోన్న సమయంలో ఈ డ్రగ్స్‌ మాఫియా వెనుక సంతానం (విజయ్‌ సేతుపతి) హస్తం ఉన్నట్లు గుర్తిస్తాడు. అంతేకాకుండా కర్ణన్‌ బతికే ఉన్నట్లు తెలుసుకుంటాడు. అసలు కర్ణన్‌ ఎవరు? చనిపోయినట్లు ఎందుకు బయట ప్రపంచాన్ని నమ్మించాడు? అమర్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు? రోలెక్స్‌ (సూర్య) పాత్ర ఏమిటి?.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో లోకేశ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని