Ponniyin Selvan: ఐశ్వర్య రాయ్‌లా ఉండడం చాలా కష్టం: విక్రమ్‌

భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌1’. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందిని పాత్రలో ఐశ్వర్య రాయ్‌ నటించిన విషయం తెలిసిందే. తన నటన గురించి ఇటీవల ఓ ఈవెంట్‌లో విక్రమ్‌ మాట్లాడారు.

Published : 27 Sep 2022 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌1’. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందిని పాత్రలో ఐశ్వర్య రాయ్‌ నటించిన విషయం తెలిసిందే. తన నటన గురించి ఇటీవల ఓ ఈవెంట్‌లో విక్రమ్‌ మాట్లాడారు.  ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని, సినిమా కెరీర్‌ను చాలా బాగా మేనేజ్‌ చేస్తుందని, ఎంతో అంకితభావంతో పని చేస్తుందంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

‘‘ఐశ్వర్య స్థానం ఎంతో మంది హృదయాల్లో పదిలంగా ఉంటుంది. ఆమె పరిపూర్ణమైన మహిళ. ఎందరో మహిళలకు ఆదర్శం. నేను ఆమె సినిమాలు ఎన్నో చూశాను. ఆమెను ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాను.  ఐశ్వర్య రాయ్‌లా ఉండడం చాలా కష్టం. నేను మొదటిసారి ఐశ్వర్యని చూసినప్పుడే ఎప్పటికైనా గొప్ప స్థానాలకు వెళుతుందని అనుకున్నాను.  తను ప్రపంచ సుందరి వేదికపై ఎంత ఆత్మవిశ్వాసంతో నడుచుకుందో నాకు ఇప్పటికీ గుర్తే.  చెన్నైలో కానీ, దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా కానీ ఇప్పటికీ తన ఫొటోలేని నగల దుకాణాలు ఉండవు’’అని అన్నారు.
‘‘నేను ఐశ్వర్యతో కలిసి కొన్ని సినిమాల్లో నటించాను. తను వృత్తికి ఎంత గౌరవం ఇస్తుందో ప్రత్యక్షంగా చూశాను. సెట్స్‌లోకి వెళ్లాక తన పాత్రలో లీనమవుతుంది. నిజ జీవితంలోనూ ఒక అమ్మగా, భార్యగా, కోడలిగా తన పాత్రలన్నింటికీ న్యాయం చేస్తుంది’’అంటూ ఐశ్వర్యని పొగడ్తలతో ముంచెత్తారు విక్రమ్‌. వీరిద్దరు ప్రధానపాత్రల్లో నటించిన పొన్నియిన్‌ సెల్వన్‌1 సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts