Vikram: అరుదైన అవకాశం దక్కించుకున్న ‘విక్రమ్‌’

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌’. ఈ సినిమా ‘బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శితం కానుంది.

Published : 03 Oct 2022 20:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కీలక పాత్రలో లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌’ (Vikram). ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఓటీటీలోనూ సత్తా చాటిన ఈ చిత్రం అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ‘బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ (Busan International Film Festival)లో ప్రదర్శితం కానున్న సినిమాల జాబితాలో నిలిచింది. అక్టోబరు 7న ‘బుసాన్‌ సినిమా సెంటర్‌’, 8న ‘సి.జి.వి. సెంటమ్‌ సిటీ 4’ వేదికగా ఈ చిత్రం సందడి చేయనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్‌కు ఎంపికైనందుకు ‘విక్రమ్‌’ చిత్ర నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఓపెన్‌ సినిమా కేటగిరీలో విక్రమ్‌ సెలెక్ట్‌ అయిందని తెలిపింది. ఆసియా దేశాలకు సంబంధించిన యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఈ వేడుక నిర్వహిస్తుంటారు. 1996లో ప్రారంభమవగా ఇప్పటికి 26 ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ పూర్తయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు 5 నుంచి 14 వరకు ఈ వేడుక జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని