Vikram: ఓటీటీలో ‘విక్రమ్‌’ స్ట్రీమింగ్‌ అప్పటి నుంచేనా?

కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌’

Updated : 21 Jun 2022 14:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌’(Vikram). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. లోకేశ్‌ టేకింగ్‌, కమల్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ల నటన మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటికే థియేటర్‌లో సినిమా చూసిన ప్రేక్షకులు ఓటీటీకి ఎప్పుడు వస్తుందా? అని వేస్తున్నారు. ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ వార్త సోషల్‌మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది. జులై 8వ తేదీ నుంచి ‘విక్రమ్‌’ను ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీనిపైన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని