Published : 16 May 2022 01:49 IST

Vikram: ‘విక్రమ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది.. కమల్, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ అదరగొట్టారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్రమ్‌’. విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ముగ్గురు హీరోల లుక్స్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందినట్టు, కమల్‌హాసన్‌ ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. సన్నివేశానికి తగ్గట్టు అనిరుధ్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’ చిత్రాల తర్వాత లోకేష్‌ దర్శకత్వం వహించిన సినిమా కావడం, ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటించడంతో ‘విక్రమ్‌’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ట్రైలర్‌ ఆ అంచనాలను ఇంకాస్త పెంచేలా ఉంది. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో సూర్య అతిథిగా కనిపిస్తారని సమాచారం.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని