vikram vedha:స్టెప్పులతో అదరగొట్టిన హృతిక్‌... విక్రమ్‌ వేద వీడియో సాంగ్‌ రిలీజ్‌

బాలీవుడ్ సూపర్‌హీరో హృతిక్‌రోషన్‌(Hrithik Roshan) ‘అల్కొహోలియా’(Alcoholia) అంటూ ఊగిపోయాడు. తన మార్కు స్టెప్పులతో అదరగొట్టాడు. చుట్టు మూగిన జనంతో...

Published : 18 Sep 2022 01:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బాలీవుడ్ సూపర్‌హీరో హృతిక్‌రోషన్‌(Hrithik Roshan) ‘ఆల్కో హోలియా’(Alcoholia) అంటూ ఊగిపోయాడు. తన మార్కు స్టెప్పులతో అదరగొట్టాడు. పుష్కర్‌-గాయత్రి(Pushkar-Gayathri) దర్శకత్వంలో హృతిక్‌రోషన్(Hrithik Roshan)‌, సైఫ్‌అలీఖాన్(‌Saif Ali Khan) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విక్రమ్‌ వేద(Vikram Vedha). 2017లో విజయ్‌సేతుపతి-మాధవన్‌ కాంబినేషన్లో వచ్చిన విజయవంతమైన తమిళ చిత్రం విక్రమ్‌ వేదకు ఇది రీమేక్‌. ఈ చిత్రంలో హృతిక్‌ నెగెటివ్‌ రోల్‌(వేద) పోషించగా, సైఫ్‌ అలీఖాన్‌ పోలీసు అధికారి(విక్రమ్‌) పాత్ర పోషిస్తున్నారు. రాధిక ఆప్టే(Radhika Apte) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఇటీవల విడుదలైన విక్రమ్‌ వేద ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఓ ‘ఆల్కోహోలియా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను విక్రమ్‌ వేద టీం విడుదల చేసింది. గణేశ్‌ హెగ్డే నృత్యరీతులు సమకూర్చారు. హృతిక్‌రోషన్‌ స్టెప్పులు, హావభావాలు అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. దాదాపు రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన విక్రమ్‌వేద ఈ నెల(సెప్టెంబరు) 30న విడుదల కానుంది. హిందీలో విడుదలవనున్న ఈ చిత్రాన్ని వైనాట్‌ స్టుడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని