Vikram Vedha: 100 దేశాల్లో విడుదల కానున్న సినిమా...

హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ కలిసి నటించిన  ‘విక్రమ్‌ వేద’ గురించి ఓ న్యూస్‌ ప్రస్తుతం ఫిల్మ్‌ ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో

Published : 15 Sep 2022 14:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ కలిసి నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌ వేద’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ  సినిమా గురించి ఓ న్యూస్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్రబృదం సిద్ధమైంది.  ఏకంగా 100 దేశాల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ లాంటి 22 యూరప్‌ దేశాలతోపాటు ఆఫ్రికాలోని 27 దేశాల్లోనూ విడుదల కానుంది. వీటిలో బాలీవుడ్‌కు అంతగా పట్టులేని జపాన్‌, రష్యా, పెరూ ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం గురించి రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓవర్సీస్‌ బిజినెస్‌ అధినేత  ధ్రువ సిన్హా మాట్లాడుతూ..‘‘విక్రమ్‌ వేద సినిమాను అందరూ ఆదరిస్తారు.  ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళంలో విజయవంతమైన ‘విక్రమ్‌ వేద’ చిత్రాన్ని హిందీలోనూ అదే పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. పుష్కర్‌ గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని