Updated : 26 Jun 2022 07:08 IST

Vikrant Rona: ‘విక్రాంత్‌ రోణ.. ఓ గొప్ప అనుభూతి’

సుదీప్‌(Sudeep) కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘విక్రాంత్‌ రోణ’(Vikrant Rona). జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌(Jacqueline Fernandez), నిరూప్‌ భండారి, నీతా అశోక్‌ కీలక పాత్రలు పోషించారు. అనూప్‌ భండారి(Anup Bhandari) దర్శకుడు. షాలిని ఆర్ట్స్‌ పతాకంపై జాక్‌ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌ నిర్మించారు. ఈ సినిమా తెలుగు త్రీడీ ట్రైలర్‌ని ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. సినీ ప్రముఖులు విజయేంద్రప్రసాద్‌(Vijayendra Prasad), రామ్‌గోపాల్‌ వర్మ(RGV), అఖిల్‌ అక్కినేని(Akhil) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్రైలర్‌, పాట బాగుందని చిత్ర బృందాన్ని అభినందించారు విజయేంద్రప్రసాద్‌. రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ ‘‘ఇన్నాళ్లూ కన్నడ పరిశ్రమ అంటే ఏదో చిన్న పల్లెటూళ్లో సినిమాలు తీస్తున్నారనే అభిప్రాయం ఉండేది. ఈ రోజున భారతీయ సినిమాకే తలమానికంలాంటి చిత్రాలొస్తున్నాయి. ‘కె.జి.ఎఫ్‌’ చిత్రాల తర్వాత ‘విక్రాంత్‌ రోణ’ వస్తోంది. ఇందులోని కొన్ని సన్నివేశాల్ని చూసి ఆశ్చర్యపోయా. సుదీప్‌ కెరీర్‌లోనే అత్యుత్తమమైన నటనని ప్రదర్శించారు. మంగ్లీ పాట చాలా బాగుంది’’ అన్నారు. అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ ‘‘కిచ్చా సుదీప్‌ చూపులు, మాటల కంటే ఆయన ఆలోచనలు శక్తిమంతంగా ఉంటాయి. కన్నడ పరిశ్రమ నుంచి వస్తున్న మరో అద్భుతమైన సినిమా ఇది. దక్షిణ భారతీయుడిగా గర్వపడుతున్నా’’ అన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని