Updated : 24 Jun 2022 08:54 IST

Vikranth Rona: మర్మమైన ఊరు.. భయంకరమైన కథ

అదొక మర్మమైన ఊరు. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథని దాచాలనుకుంటున్నారు. ఇప్పుడా కథ మళ్లీ మొదలైంది. ఆ డెవిల్‌ మళ్లీ వచ్చాడు. మరి ఆ ఊరి కథేంటి? అక్కడి ప్రజలు దాయాలనుకుంటున్న ఆ భయంకర కథేంటి? అక్కడికి మళ్లీ వచ్చిన ఆ డెవిల్‌ ఎవరు? తెలియాలంటే ‘విక్రాంత్‌ రోణ’(Vikrant Rona) చూడాల్సిందే. సుదీప్‌ (Sudeep) హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. అనూప్‌ బండారి (Anup Bhandari) తెరకెక్కించారు. నిరూప్‌ బండారి, నీతా అశోక్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్‌ గురువారం విడుదల చేశారు. ‘‘భయం నిండిన ఆ ఊరిలోకి.. భయమంటే ఏంటో తెలియని ఒకడొచ్చాడు’’ అంటూ హీరో సుదీప్‌ పాత్రను స్టైలిష్‌గా పరిచయం చేశారు. ఇందులో ఆయన విక్రాంత్‌ రోణ అనే పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. జులై 28న సినిమా విడుదల కానుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని