Vikrant Rona: ‘విక్రాంత్‌ రోణ’ తెలుగు వెర్షన్‌ ఆ ఓటీటీలో.. ఎప్పుడంటే?

కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జులైలో థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

Published : 01 Sep 2022 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ (Sudeep) నటించిన పాన్ ఇండియా చిత్రం ‘విక్రాంత్‌ రోణ’ (Vikrant Rona). భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జులైలో థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల, కన్నడ వెర్షన్‌కు సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ ఖరారవగా.. తాజాగా తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటన వెలువడింది. ‘జీ  5’ (Zee 5) వేదికగా ఈ నెల 2 నుంచి కన్నడ భాషలో స్ట్రీమింగ్‌ కానున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో ఈ నెల 16 నుంచి అందుబాటులోకి రానుంది. అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిరూప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వెలిన్‌, రవిశంకర్‌ గౌడ తదితరులు నటించి మెప్పించారు.

ఈ సినిమా కథేంటంటే?

కొమ‌ర‌ట్టు అనే ఊరిలో జ‌రిగే కథ ఇది. ఆ ఊరిలోని ఓ పాడుబ‌డ్డ ఇంట్లో ఓ బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడన్నది అక్కడి ప్రజ‌ల న‌మ్మకం. ఆ ఇంటి ఆవరణలో ఉన్న బావిలో ఓరోజు ఆ ఊరి ఇన్‌స్పెక్టర్‌ శవం దొరుకుతుంది. ఆ హత్య కేసు ఛేదించి, నేరస్థులను పట్టుకోవడం కోసం విక్రాంత్‌ రోణ (సుదీప్‌) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో అప్పటికే ప‌దుల సంఖ్యలో పిల్లలు హ‌త్యకు గురైన‌ట్లు తెలుసుకుంటాడు. మ‌రి వాళ్ల మ‌ర‌ణాల‌కు.. పోలీస్ హ‌త్యకు ఉన్న సంబంధమేమిటి? ఈ కేసుకు విక్రాంత్ వ్యక్తిగ‌త జీవితానికి ఉన్న లింకేంటి? అస‌లు ఆ ఊరిలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడు ఎవ‌రు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని