పుష్పరాజ్ పోరాటం ఇతడితోనే

అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ టీమ్‌ నుంచి వీకెండ్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ ‘పుష్పరాజ్‌’గా కనిపించనున్న విషయం తెలిసిందే...

Updated : 21 Mar 2021 15:20 IST

విలన్‌ని పరిచయం చేసిన టీమ్‌

హైదరాబాద్‌: అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ టీమ్‌ నుంచి వీకెండ్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ ‘పుష్పరాజ్‌’గా కనిపించనున్న విషయం తెలిసిందే. కాగా, ఎంతో భయంకరమైన ‘పుష్పరాజ్‌’తో పోటీ పడనున్న ప్రతినాయకుడ్ని తాజాగా చిత్రబృందం ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ మేరకు మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ‘పుష్ప’ విలన్‌ వీడియో ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తోంది.

‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో బన్నీ మాస్‌, రఫ్‌ లుక్‌లో విభిన్నంగా కనిపించనున్నారు. అంతేకాకుండా ‘పుష్ప’ కోసం ఆయన చిత్తూరు మాండలికాన్ని నేర్చుకున్నారు. రష్మిక కథానాయిక. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని