Vinaro Bhagyamu Vishnu Katha: అందరూ మెచ్చే వినరో భాగ్యము విష్ణుకథ

‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) అంటూ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మురళి కిషోర్‌ అబ్బూరు తెరకెక్కించారు.

Updated : 08 Feb 2023 07:19 IST

‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) అంటూ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మురళి కిషోర్‌ అబ్బూరు తెరకెక్కించారు. బన్నీ వాస్‌ నిర్మాత. కశ్మీరా కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో హీరో సాయిధరమ్‌ తేజ్‌ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చూడగానే చాలా కొత్తగా అనిపించింది. పాటలు అద్భుతంగా ఉన్నాయి. సినిమా పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘టైటిల్‌ చాలా బాగుంది. మన సంస్కృతిని ప్రతిబింబించే చక్కటి తెలుగు పేరిది. అందరి ఇళ్లలో ఉండే హీరో కిరణ్‌. కథను నమ్ముకుంటూ ముందుకెళ్తున్నాడు’’ అన్నారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చూశాక ఎంత మంచి చిత్రం తీశారని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. నేను ఐదు సినిమాలతో నేర్చుకున్నదంతా ఈ చిత్రంలో చూపించా. కచ్చితంగా ఈ శివరాత్రి మాదే’’ అన్నారు. ‘‘ఈ కథలో మంచి, చెడు రెండూ ఉంటాయి. వాటినే ఈ సినిమాలో చర్చించాం. మేమంతా ఎంతో బాధ్యతతో ఈ చిత్రం చేశాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది’’ అన్నారు దర్శకుడు మురళి కిషోర్‌ అబ్బూరు. నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘కథా బలమున్న చిత్రమిది. ఈ సినిమా కోసం కిరణ్‌ చాలా కష్టపడ్డాడు’’ అన్నారు. ‘‘చాలా ఆసక్తికరమైన కథతో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు నిర్మాత బన్నీ వాస్‌. ఈ కార్యక్రమంలో మారుతి, భాస్కరభట్ల, చైతన్‌ భరద్వాజ్‌ పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని