Jailer: రజనీకాంత్‌ హగ్‌ చేసుకునేవారు.. అంతకుమించి ఏం అడగగలను: ‘జైలర్‌’ విలన్‌

‘జైలర్‌’లో విలన్‌గా నటించిన వినాయకన్‌ హీరో రజనీకాంత్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే?

Published : 18 Sep 2023 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్‌’ (Jailer). రిటైర్డ్‌ పోలీసు అధికారి ముత్తువేల్‌ పాండ్యన్‌గా రజనీకాంత్‌ ఎలా అలరించారో విగ్ర‌హాల దొంగ‌త‌నం ముఠా నాయ‌కుడైన వ‌ర్మగా వినాయకన్‌ (Vinayakan) అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘హీరోకు తగ్గ విలన్‌’ అని అనిపించుకున్న వినాయకన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రజనీకాంత్‌ తనని ఎంతో ఇష్టంగా చూసుకునేవారని చెప్పారు. పారితోషికం విషయంలో వచ్చిన రూమార్స్‌పైనా వినాయకన్‌ స్పందించారు.

తన రికార్డును తనే బ్రేక్‌ చేసిన షారుక్‌ ఖాన్‌.. అదేంటంటే?

‘‘సెట్స్‌లో నన్ను చూసిన ప్రతీసారి రజనీకాంత్‌ హగ్‌ చేసుకునేవారు. ఒకవేళ నేను కనిపించకపోతే ‘వినాయకన్‌ ఎక్కడ?’ అని అక్కడున్న వారిని అడిగేవారు. అంతకుమించి ఏం అడగగలను. అదో ఆశీర్వాదంలా భావిస్తున్నా. నటనలో ఆయన నాకెంతో స్వేచ్ఛ ఇచ్చారు. నాకు నచ్చినట్లు నటించమని చెప్పేవారు. ఆయన నా దేవుడు. సుమారు 30 ఏళ్ల నుంచి ఆయన్ను ఫాలో అవుతున్నా’’ అని తెలిపారు. ‘జైలర్‌’ సినిమాలోని నటనకుగాను రూ.35 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. నేను అడిగిన దాని కంటే మూడు రెట్లు అధికంగా ఇచ్చారని చెప్పారు. బాక్సాఫీసు వద్ద సుమారు రూ.600 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు