Pawan Kalyan: జులైలో థియేటర్లలో సందడి

‘వినోదాయ సిథం’ (Vinodhaya Sitham) రీమేక్‌ కోసం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సముద్రఖని తెరకెక్కిస్తున్నారు.

Updated : 25 Mar 2023 07:04 IST

‘వినోదాయ సిథం’ (Vinodhaya Sitham) రీమేక్‌ కోసం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Sai dharam Tej) చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా జులై 28న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామంది. ఫాంటసీ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో పవన్‌ దేవుడిగా కనిపించనుండగా.. సాయిధరమ్‌ తేజ్‌ ఆయన భక్తుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కథానాయికలు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు