Ajith Kumar: ‘అజిత్‌ 61’.. సెట్స్‌పైకి ఆరోజే?

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ 61వ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ‘నీర్కొండ పార్వై’, ‘వలిమై’ సినిమాల

Published : 06 Mar 2022 14:42 IST

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ 61వ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ‘నీర్కొండ పార్వై’, ‘వలిమై’ సినిమాల తర్వాత ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. ఇది మార్చి 10న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలు కానున్నట్లు సమాచారం. ఈనెల మూడో వారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చెన్నై మౌంట్‌ రోడ్‌ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రంలో అజిత్‌ లుక్‌కు సంబంధించిన ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని