Ponniyin Selvan: మోత మోగిపోవాల్సిందే

విక్రమ్‌ పేరుకి తమిళ నటుడే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పేరు. ఇంకా చెప్పాలంటే ఆయన జాతీయస్థాయి నటుడు. సూర్య తమ్ముడిగా కెరీర్‌ మొదలుపెట్టినా స్టార్‌ హీరోగా ఎదిగారు కార్తి. ఈ ఇద్దరి సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది.

Updated : 25 Sep 2022 08:30 IST

విక్రమ్‌ పేరుకి తమిళ నటుడే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పేరు. ఇంకా చెప్పాలంటే ఆయన జాతీయస్థాయి నటుడు. సూర్య తమ్ముడిగా కెరీర్‌ మొదలుపెట్టినా స్టార్‌ హీరోగా ఎదిగారు కార్తి. ఈ ఇద్దరి సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. మాస్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ ఇద్దరికీ మోత మోగించడం కొత్తేమీ కాదు. కానీ అది ఇలా బాజా మోత కాదు..బాక్సాఫీసు మోత. ఎన్నో హిట్‌ సినిమాలతో బాక్సాఫీసుకు కాసులు కురిపించారు ఈ హీరోలు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రచార వేడుక కోసం అతిథులకు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో విక్రమ్, కార్తి సరదాగా బాజా మోగించి వేడుకలో జోష్‌ నింపారు. ఇంతకుమించిన జోష్‌ సినిమాలో ఉంటుందని బలంగా చెబుతున్నారు. ఈ నెల 30న సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది మోత ఏస్థాయిలో ఉంటుందో..!


‘ఖైదీ2’.. సెట్స్‌పైకి అప్పుడే

‘ఖైదీ’ చిత్రానికి సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. కార్తి - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ ముందు ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు చక్కటి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉండనున్నట్లు చిత్ర బృందం గతంలోనే ప్రకటించింది. అయితే ఇదింత వరకు కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ సీక్వెల్‌పై కార్తి స్పష్టత ఇచ్చారు. ‘వచ్చే ఏడాది ‘ఖైదీ2’ మొదలు పెడతాం’ అని స్పష్టత ఇచ్చారు. లోకేష్‌ ప్రస్తుతం విజయ్‌తో ఓ సినిమా రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇది నవంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది పూర్తయిన వెంటనే ‘ఖైదీ’ సీక్వెల్‌ పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రఫ్‌ డ్రాఫ్ట్‌ పూర్తయిందని సమాచారం. కార్తి ప్రస్తుతం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. అలాగే త్వరలో ‘సర్దార్‌’గా బాక్సాఫీస్‌ ముందు సందడి చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని