Virata Parvam: సాయి పల్లవి వల్ల మంచోడిలా ఫీలవుతున్నా: రానా

రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్‌ చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకుడు. ఎస్‌.ఎల్‌. వి. సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూన్‌ 17న విడుదలకానుంది.

Published : 07 Jun 2022 02:10 IST

విజయవాడ: రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్‌ చిత్రం ‘విరాటపర్వం’ (Virata Parvam). వేణు ఊడుగుల దర్శకుడు. ఎస్‌.ఎల్‌. వి. సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూన్‌ 17న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు వేదికలపై ప్రచారం చేసిన చిత్ర బృందం సోమవారం విజయవాడ, గుంటూరుకు చేరుకుంది.

ఈ సందర్భంగా రానా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలనే ఉద్దేశంతో దర్శకుడు ముందుగా నాకు మూడు పేజీల్లో స్క్రిప్టు పంపించారు. నాయికా ప్రాధాన్య చిత్రం కావడంతో ఓ కీలక పాత్ర కోసం హీరోలెవరు ముందుకు రావట్లేదని తెలిసింది. నేను.. హీరోహీరోయిన్‌కు సంబంధం లేకుండా కథ నడిచే సినిమాలు చూస్తూ పెరిగా. ‘సింధూరం’, ‘అంతఃపురం’ తదితర చిత్రాల ప్రభావం నాపై బాగా ఉంది. ‘విరాటపర్వం’ అలాంటిదే అనిపించి, ఈ సినిమాలో నటించా. సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఆమె చాలా మంచి మనిషి. తన మంచితనం నాపై ప్రభావం చూపింది. ఇప్పుడు నేనూ మంచోడిలా ఫీలవుతున్నా’’ అని అన్నారు. ‘‘నేను గొప్ప’ అని రానా ఎప్పుడూ అనుకోరు. సినిమా కోసమే ఆయన పరితపిస్తుంటారు. తన చిత్ర బృందాలకు సపోర్ట్‌ ఇస్తుంటారు’’ అని సాయి పల్లవి పేర్కొన్నారు.

నిర్మాత సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ.. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాని ఎక్కువ మంది చూస్తే బావుంటుందని అనిపించింది. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా టికెట్‌ ధరలను నిర్ణయించాం. మల్టీప్లెక్స్‌ల్లో రూ. 150 (+ట్యాక్స్‌), సింగిల్‌ స్క్రీన్లలో రూ. 100 (+ ట్యాక్స్‌)గా ఉండనున్నాయి’’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని