VirataParvam: ‘విరాటపర్వం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాటపర్వం’ ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ చిత్రం జులై 1 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా సదరు సంస్థ ప్రకటించింది.

Published : 29 Jun 2022 19:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానా (rana), సాయి పల్లవి (sai pallavi) ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాటపర్వం’ (ViarataParvam) ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ చిత్రం జులై 1 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా సదరు సంస్థ ప్రకటించింది. ‘‘విరాటపర్వం’ ప్రపంచాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి’’ అని ‘నెట్‌ఫ్లిక్స్‌’ పేర్కొంది. తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని తెలిపింది. 

నక్సలిజం, ప్రేమ నేపథ్యంలో దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది. కామ్రేడ్‌ రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవి ఒదిగిపోయారు. ప్రియమణి, నందాతా దాస్‌, ఈశ్వరీరావు, జరీనా తదితరులు కీలక పాత్రల్లో కనిపించి, ఆకట్టుకున్నారు. 90ల్లో సాగే కథ ఇది. రవన్న (రానా) రాసిన పుస్తకాలు ప్రభావితమవుతుంది వెన్నెల (సాయి పల్లవి). ఆ అక్షరాలతోపాటు రవన్నతోనూ ఆమె ప్రేమలో పడుతుంది. కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం కుదర్చగా తనకు ఆ వివాహం చేసుకోవడం ఇష్టంలేదని, రవన్నతోనే ఉంటానని వెన్నెల ఇల్లు విడిచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో ఆమె నక్సలైట్‌గా మారి, ఎట్టకేలకు రవన్నను కలిసి, తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో వెన్నెలకు ఎదురైన సమస్యలేంటి? రవన్న.. వెన్నెల ప్రేమను అంగీకరించాడా? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపొందింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని