Sai Pallavi: ‘వెన్నెల’ పాత్ర చేయడం నా అదృష్టం: సాయిపల్లవి
హైదరాబాద్: ‘విరాటపర్వం’లో (Virataparvam) వెన్నెల (Vennala) పాత్ర పోషించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు నటి సాయిపల్లవి (Sai Pallavi) అన్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ శుక్రవారం ఉదయం ఆమె ఓ ట్వీట్ పెట్టారు. ‘‘విరాటపర్వం’లోని వెన్నెల పాత్రను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ పాత్ర పోషించడం నిజంగా నా అదృష్టం. ఆ పాత్ర, చిత్రబృందం, చిత్రీకరణ రోజులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఇలాంటి అద్భుతమైన పాత్రను నాకందించిన రానా, వేణు ఊడుగుల, ఇతర బృందానికి ధన్యవాదాలు. ఈరోజు నుంచి ‘విరాటపర్వం’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందరికీ అందుబాటులో ఉండనుంది. వెన్నెల ప్రయాణాన్ని మీరందరూ వీక్షిస్తే నేను మరింత ఆనందిస్తా’’ అని ట్వీట్ చేశారు.
నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధమైన ఇంటెన్స్ ప్రేమకథా చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకుడు. రానా(Rana), సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించారు. 90ల్లో సాగే కథ ఇది. రవన్న (రానా) రాసిన పుస్తకాలకు ప్రభావితమవుతుంది వెన్నెల (సాయి పల్లవి). ఆ అక్షరాలతోపాటు అతడితోనూ ఆమె ప్రేమలో పడుతుంది. కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూడగా.. తనకు ఆ వివాహం చేసుకోవడం ఇష్టంలేదని, రవన్నతోనే ఉంటానని ఇల్లు విడిచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో ఆమె నక్సలైట్‌గా మారి, ఎట్టకేలకు రవన్నను కలిసి, తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో వెన్నెలకు ఎదురైన సమస్యలేంటి? రవన్న.. వెన్నెల ప్రేమను అంగీకరించాడా? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపొందింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad News: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్వేర్ ఉద్యోగి..
-
World News
Ukraine war: క్రిమియాకు విముక్తితోనే యుద్ధం ముగింపు: జెలెన్స్కీ
-
General News
Godavari: ధవళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
-
Movies News
Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
-
India News
Bihar: లాలూజీ.. మీ ఇంట్లోకి పాము మళ్లీ చొరబడింది..!
-
World News
Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!