Virupaksha: ‘విరూపాక్ష’ మీమ్స్.. ఈ వైరల్ వీడియోలు చూస్తే నవ్వాగదు!
సాయిధరమ్ తేజ్, సంయుక్త ప్రధాన పాత్రల్లో దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన చిత్రం.. ‘విరూపాక్ష’. బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకుని, ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా సన్నివేశాలపై వచ్చిన మీమ్స్ చూశారా..?
ఇంటర్నెట్ డెస్క్: ‘ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలగేరిపోతానంతే’.. అని ‘మన్మథుడు’ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టే.. ‘ఈ మాత్రం కంటెంట్ దొరికితే చాలు చెలగేరిపోతాం’ అని మీమర్స్ అంటుంటారు. ఏ కొత్త సినిమా వచ్చినా అందులోని ఫేమస్ సంభాషణలు, సన్నివేశాలకు తమదైన శైలిలో హాస్యం జోడించి నెటజన్లను అలరిస్తుంటారు. అలా.. ‘విరూపాక్ష’ (Virupaksha) సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను ఉపయోగించి వారు చేసిన మీమ్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Teja), సంయుక్త (Samyuktha) ప్రధాన పాత్రల్లో దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి.. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంకెందుకు ఆలస్యం.. సినిమాలోని సీరియస్ సీన్లకు మీమర్స్ జోడించిన కామెడీని చూసి మీరూ నవ్వుకోండి (Virupaksha Memes)..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.