Virupaksha: రూ.62 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తూ.. ఆ మూడు భాషల్లో విడుదలకు సిద్ధమై..

సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త జంటగా దర్శకుడు కార్తిక్‌ దండు తెరకెక్కించిన చిత్రం ‘విరూపాక్ష’. త్వరలోనే ఇతర భాషల్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Published : 29 Apr 2023 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న కథలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ‘విరూపాక్ష’ (Virupaksha) సినిమాతో మరోసారి రుజువైంది. సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఏప్రిల్‌ 21 విడుదలై హిట్‌టాక్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడు రోజుల్లో రూ.62.5 కోట్లు వసూళ్లు చేసిన ఈ చిత్రం దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. మరోవైపు, హిందీ, తమిళ్‌, మలయాళంలో విడుదలకు సిద్ధమైంది. ‘‘తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న విరూపాక్ష ఇతర భాషల్లోనూ సందడి చేయబోతోంది’’ అంటూ చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. హిందీలో గోల్డ్‌మైన్స్‌, తమిళ్‌లో స్టూడియో గ్రీన్‌, మలయాళంలో E4 ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపింది. రిలీజ్‌ డేట్‌ ఇంకా ప్రకటించలేదు. ‘విరూపాక్ష’ను పాన్‌ ఇండియా స్థాయిలోనే విడుదల చేయాలని ముందుగా భావించినా.. డబ్బింగ్‌ తదితర కార్యక్రమాలకు సమయంలేకపోవడంతో తెలుగులోనే విడుదలైంది.  

రుద్రవనం గ్రామం ఇతివృత్తంతో పీరియాడికల్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు కార్తిక్‌ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రుద్రవనం ప్రజల చావుల వెనకున్న రహస్యాల్ని ఛేదించే సూర్య పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ నటించారు. అతడి ప్రేయసిగా కథానాయిక సంయుక్త కనిపించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని