Virupaksha ott release: ‘విరూపాక్ష’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Virupaksha ott release: సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘విరూపాక్ష‌’ (Virupaksha) ఓటీటీ విడుదల ఖరారైంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది.

Updated : 16 May 2023 11:45 IST

హైదరాబాద్‌: ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ సాధించిన సినిమాల్లో సాయిధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష‌’ (Virupaksha) ఒకటి. కార్తీక్‌ దండు తెరకెక్కించిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ (netflix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓటీటీలో దీని రిలీజ్‌ తేదీని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మే 21 నుంచి (Virupaksha ott release) అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ‘మూడో కన్నుతో మాత్రమే చూడగలిగే ఒక నిజం రానుంది. మీరు చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అని పోస్ట్‌ చేసింది. సాయిధ‌ర‌మ్ తేజ్ (Saidharam Tej) సరసన సంయుక్త (Samyuktha) నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని భారీ వసూళ్లను రాబట్టింది. 

క‌థేంటంటే: రుద్ర‌వ‌నం అనే ఊరి చుట్టూ సాగే క‌థ ఇది. చేత‌బ‌డి చేస్తూ చిన్న పిల్ల‌ల మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌వుతున్నారంటూ ఆ ఊరికి వ‌చ్చిన ఓ జంట‌ని స‌జీవ ద‌హ‌నం చేస్తారు గ్రామ‌స్థులు. వారు మంట‌ల్లో కాలిపోతూ పుష్క‌ర కాలం త‌ర్వాత ఈ ఊరు వ‌ల్ల‌కాడు అయిపోతుంద‌ని శపిస్తారు. అందుకు త‌గ్గ‌ట్టే స‌రిగ్గా ప‌న్నెండేళ్ల త‌ర్వాత ఆ ఊళ్లో వ‌రుసగా మ‌ర‌ణాలు సంభ‌విస్తాయి. దాంతో గ్రామాన్ని అష్ట‌దిగ్బంధ‌నం చేయాల‌ని తీర్మానిస్తారు పెద్ద‌లు. కొన్ని రోజుల‌పాటు అక్కడి జ‌నాలు బ‌య‌టికి వెళ్ల‌డానికి కానీ.. కొత్త‌వాళ్లు ఊళ్లోకి రావ‌డానికి కానీ అవ‌కాశం లేకుండా చేస్తారు. అయినా స‌రే మ‌ర‌ణాలు మాత్రం ఆగ‌వు. త‌న త‌ల్లితో క‌లిసి బంధువుల ఇంటికి వ‌చ్చిన సూర్య (సాయిధ‌ర‌మ్ తేజ్‌) (Saidharam Tej) తిరిగి వెళ్లే అవ‌కాశం ఉన్నా.. తాను మ‌న‌సుప‌డిన నందిని (సంయుక్త‌) (Samyuktha) ప్రాణాల్ని కాపాడ‌టం కోసం మ‌ళ్లీ ఊళ్లోకి తిరిగొస్తాడు. ఈ చావుల వెన‌కున్న ర‌హ‌స్యాల్ని ఛేదించ‌డానికి న‌డుం బిగిస్తాడు. మ‌రి సూర్య త‌ను అనుకున్నది చేశాడా? ఈ వ‌రుస చావుల వెన‌క ఎవ‌రున్నార‌నేది మిగ‌తా క‌థ (Virupaksha on netflix).Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు