Sai Dharam Tej: ఆ పాత్రని చంపితే.. నువ్వు ఈ ప్రశ్న అడగవు: సాయిధరమ్‌ తేజ్‌

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నూతన దర్శకుడు కార్తిక్‌ దండు తెరకెక్కించిన చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా హిట్‌టాక్‌ సొంతం చేసుకున్న సందర్భంగా సాయిధరమ్‌ తేజ్‌.. ఫ్యాన్స్‌తో ముచ్చటించారు.

Published : 25 Apr 2023 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘విరూపాక్ష’ (Virupaksha) విజయోత్సాహంలో ఉన్న హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. సినిమా విశేషాలతోపాటు పెళ్లి ప్రస్తావనపైనా తనదైన శైలిలో స్పందించారు. ఆ వివరాలివీ.. 

* ‘విరూపాక్ష’ హిందీ వెర్షన్‌ ఎప్పుడు విడుదల చేస్తారు?

సాయిధరమ్‌ తేజ్‌: మే 5న రిలీజ్‌ చేసేలా ప్రయత్నిస్తున్నాం.

* ఈ సినిమా పార్ట్‌ 2 ఉంటుందా?

సాయిధరమ్‌ తేజ్‌: ఉంది అనే కదా పార్ట్‌ 1లో హింట్‌ ఇచ్చాం.

* ‘విరూపాక్ష’లో రాజీవ్‌ కనకాల పాత్రను ఎందుకు చంపలేదు?

సాయిధరమ్‌ తేజ్‌: చంపితే నువ్వు ఈ ప్రశ్న అడగవు కదా!

* మీ తదుపరి చిత్రం #PKSDT టైటిల్‌ లీక్‌ చేయండి.

సాయిధరమ్‌ తేజ్‌: నీదేం పోయింది. అలా చేస్తే ‘తేజూ గారు’ అంటూ నాకు ఫోన్‌ కాల్‌ వస్తుంది.

* PKSDT కాకుండా మరో సినిమా చేస్తున్నారా?

సాయిధరమ్‌ తేజ్‌: నూతన దర్శకుడు జయంత్‌ తెరకెక్కిస్తోన్న లవ్లీ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో నటిస్తున్నా.

* మీతో ఓ సినిమా తీయాలని ఉంది. దాని కోసం ఏం చేయాలి?

సాయిధరమ్‌ తేజ్‌: కార్తిక్‌ (విరూపాక్ష దర్శకుడు), జయంత్‌లా మంచి కథతో వస్తే సినిమా చేసేందుకు నేను రెడీ.

* తమిళ దర్శకుల్లో మీ ఫేవరెట్‌ ఎవరు?

సాయిధరమ్‌ తేజ్‌: మణిరత్నం సర్‌. ఇప్పటి దర్శకుల్లో లోకేశ్‌ కనగరాజ్‌, మిత్రన్‌. 

* చిరంజీవితో కలిసి ఎప్పుడు నటిస్తారు?

సాయిధరమ్‌ తేజ్‌: ఆయన పిలిచినప్పుడు.

* కథానాయికల్లో మీ క్రష్‌ ఎవరు?

సాయిధరమ్‌ తేజ్‌: సమంత.

* రామ్‌చరణ్‌ గురించి ఒక్క మాటలో..

సాయిధరమ్‌ తేజ్‌: ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం బ్రదర్‌.

* మెగా ఫ్యామిలీ కాకుండా మీరు అభిమానించే టాలీవుడ్‌ హీరోలు?

సాయిధరమ్‌ తేజ్‌: రవితేజ గారు, ప్రభాస్‌ అన్న.

* మీ కెరీర్‌లో సవాలు విసిరిన పాత్ర?

సాయిధరమ్‌ తేజ్‌: ‘రిపబ్లిక్‌’లోని అభిరామ్‌ పాత్ర.

* మీకు ఇష్టమైన వంటలు?

సాయిధరమ్‌ తేజ్‌: అన్నం.. పప్పు.. నెయ్యి.. ఆవకాయ్‌.

* పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?

సాయిధరమ్‌ తేజ్‌: నీకు అయిన తర్వాత చేసుకుంటా. నీ పెళ్లి ఎప్పుడు?

* అరేంజ్‌ మ్యారేజ్‌ చేసుకుంటారా? లవ్‌ మ్యారేజా?

సాయిధరమ్‌ తేజ్‌: ఇన్ని ఆప్షన్లు ఉంటాయా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని