Virupaksha: నిజాన్ని చూపించే మరో నేత్రం
‘‘విశ్వజనీనమైన కథతో మిస్టీక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘విరూపాక్ష’.
‘‘విశ్వజనీనమైన కథతో మిస్టీక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది’’ అన్నారు సాయిధరమ్‌తేజ్ (Saidharam Tej). ఆయన కథానాయకుడిగా కార్తీక్ దండు రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రమే ‘విరూపాక్ష’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢనమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’’ అంటూ ఎన్టీఆర్ (NTR) వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ప్రచార చిత్రం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘మా అమ్మ కోసమే ఈ చిత్రం చేశాను. ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్నప్పుడు తనకి ఓ విషయం చెప్పలేకపోయాను. అది ఇప్పుడు చెబుతున్నా. ‘నన్ను క్షమించు. లవ్ యూ అమ్మా’. మేము అడిగిన వెంటనే ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. నువ్వు నాపై చూపించిన ప్రేమను, చేసిన సాయాన్ని మరువలేను. ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు’’ అన్నారు. ‘‘ఓ అడవిలో ఉన్న పల్లెటూరిలో జరిగే కథ ఇది. 1990 నేపథ్యంలో సాగుతుంటుంది. అక్కడ జరిగే కొన్ని కొత్త, వింత పరిణామాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు కార్తీక్ దండు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Asaram Bapu: మరో అత్యాచారం కేసులో దోషిగా ఆశారాం బాపూ
-
Movies News
Suhas: హీరోగా ఫస్ట్ థియేటర్ రిలీజ్.. సినిమా కష్టాలు గుర్తు చేసుకుని నటుడు ఎమోషనల్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Team India: అభిమానులూ.. కాస్త ఓపిక పట్టండి.. వారికీ సమయం ఇవ్వండి: అశ్విన్
-
World News
Pakistan: మసీదులో పేలుడు ఘటనలో 44కి చేరిన మృతులు.. ఇది తమ పనేనని ప్రకటించిన టీటీపీ!
-
Politics News
Andhra news: ప్రజల దృష్టిని మరల్చేందుకే నాపై విచారణ : చింతకాయల విజయ్