Enemy: ఓటీటీలో విశాల్‌-ఆర్య ‘ఎనిమి’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు విశాల్‌.

Updated : 25 Jan 2022 12:46 IST

హైదరాబాద్‌: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు విశాల్‌. ఆర్యతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ఎనిమి’. ఆనంద్‌ శంకర్‌ దర్శకుడు. మిని స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌.వినోద్‌ కుమార్‌  నిర్మించారు. మృణాళిని రవి కథానాయిక. మమతా మోహన్‌ దాస్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. దీపావళి సందర్భంగా గత నవంబరు 4న తమిళ/తెలుగు భాషల్లో విడుదలైంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ‘ఎనిమి’ ఓటీటీ రైట్స్‌ను సోనీలివ్‌ దక్కించుకుంది. ఫిబ్రవరి నెలలో ఈ సినిమా తెలుగు/తమిళ భాషల్లో సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మిత్రులుగా ఉన్న విశాల్‌, ఆర్యలు ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చింది? ఇద్దరి మధ్య జరిగే పోరులో పై చేయి ఎవరిది? అన్నది తెరపైనే చూడాలి. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని